కరోనావైరస్ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఆ పేరు పెట్టారు. కరోనా ‘క్రౌన్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చినది. కరోనా..ఈ పేరు వింటూనే జనాల్లో ఏదో తెలియని భయము. ఈ వైరస్ దాదాపు ఒకటిన్నర సంవత్సరము అందరి జీవితాలు మార్చేసింది.అలాంటిది తిరిగి మళ్ళి భయం కలిగిస్తా ఉంది. జనవరిలో దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, మార్చిలో రోజుకు 1.8 లక్షల కేసులు రావచ్చని కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు.
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఈ కేసులు పెరిగితే కరోనా మూడో వేవ్ వచ్చినట్టే అనుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయితే కరోనా థర్డ్ వేవ్ ఎప్పటికీ ముగుస్తుందనే అంశంపై ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఏప్రిల్ నాటికి ముగుస్తుందని అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రలలో కొన్ని గంటల, రోజుల సమయములోనే కరోనా మరియు ఓమిక్రాన్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఏ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వలు స్కూలు, కాలేజీలు అన్ని సెలవులు కూడా ప్రకటించే అవకాశము ఉంది. ఎన్నికల సమయంలో ర్యాలీలు కరోనా కేసులు వేగంగా పెరిగేందుకు కారణం కావొచ్చని హెచ్చరించారు. కరోనా నిబంధనలు మరియు జాగ్రత్తలు పాటించకుండా మళ్ళి ప్రజలు సినిమాలు చూడటము, ఎన్నికల ర్యాలిలోకి వెళ్ళితే మళ్ళి కరోనా అధిక సంఖ్యలో ఎక్కువ అవ్వడము తప్పనిసరే అని ప్రొఫసర్ మనీంద్ర అగర్వాల్ అన్నారు. తన గణిత నమూనా ఆధారంగా కరోనా కేసుల గరిష్టస్థాయిని అంచనా వేసిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్.. జనవరిలో దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, మార్చిలో రోజుకు 1.8 లక్షల కేసులు రావచ్చని అంచనా వేశారు.
ఆఫ్రికా, భారత్‌లో జనాభాలో 80 శాతం మంది 45 ఏళ్లలోపు వారేనని మనీంద్ర అగర్వాల్ అన్నారు. రోగనిరోధక శక్తి రెండు దేశాల్లో 80 శాతం వరకు ఉంటుందని తెలిపారు. దక్షిణాఫ్రికా తరహానే ఒమిక్రాన్ భారత్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని పేర్కొన్నారు.