సాధారణంగా కవల పిల్లలు కొన్ని నిమిషాల తేడాలో లేదా అనే రోజుల పుడుతారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో మాత్రం రెండు వేర్వేరు సంవత్సరాల్లో కవలలు పుట్టారు. కొద్ది నిమిషాల తేడాతో ఏకంగా సంవత్సరాలే మారిపోయాయి. కలిసి పుట్టినప్పటికీ వారు వేర్వేరు రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోనున్నారు.
ఏం జరిగిందంటే.. కాలిఫోర్నియాలోని గ్రీన్ ఫీల్డ్ సిటీకి చెందిన ఫాతిమా మాడ్రిగల్ కు డిసెంబర్ 31న పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. డిసెంబర్ 31న రాత్రి 11.45 గంటలకు ఆమె పండంటి మగ బిడ్డ జన్మించగా.. 15 నిమిషాల తర్వాత 12.01 గంటలకు మరో ఆడబిడ్డకు జన్మచ్చింది.
దీంతో మగశిశులు 2021లో పుట్టగా.. పాప 2022లో జన్మించినట్లయింది. తన కవల పిల్లలు కొన్ని నిమిషాల వ్యవధిలో వేర్వేరు సంవత్సరాల్లో పుట్టడంపై తల్లి మాడ్రిగాల్ సంతోషం వ్యక్తం చేసింది. మగ బిడ్డకు ఆల్ఫ్రెడో అని, పాపకు అలీన్ అని పేర్లు పెట్టినట్లు చెప్పారు. తన కవలలు వేర్వేరు పుట్టినరోజులు కలిగి ఉండటం క్రేజీగా ఉందని అన్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని నిపుణులు అంటున్నారు.