Breaking News
Coconut Oil Uses

కొబ్బరి నూనెతో ఆ రోగాలు మాయం..అద్భుత ప్రయోజనాలివే..!

కొబ్బరి నూనెతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కేవలం తలకు రాసుకోవడానికి మాత్రమే కాదు.. కూరల్లో కూడా వేసుకుంటారు. కేరళలో కొబ్బరి నూనెతోనే వంటకాలు చేస్తుంటారు. మరి ఈ కొబ్బరి నూనెతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా? కొబ్బరి నూనెలో ఖనిజాలు, విటమిన్లు నిండి ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబర్చడానికి, రిఫ్రెష్ అనుభూతిని ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. 

కొబ్బరి నూనె మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి బాగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియ మెరుపర్చుతుంది.  ప్రతిరోజు పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. కడుపు నిండిన భావం కలిగిస్తుంది. తద్వారా బెల్లీ ఫ్యాట్‌ అదుపులో ఉంటుంది. దీంతో బరువు కూడా తగ్గుతుంది. రోజూవారి వంటకాల్లో కొబ్బరి నూనెను వాడడం వల్ల మీ కడుపులో కొవ్వు కరిగి శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందువల్ల, మీ వంటకాల్లో ఇతర నూనెలకు బదులు కొబ్బరి నూనెను వాడటం ప్రారంభించండికొబ్బరి నూనె మీ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. దీనిలో సహజమైన చక్కెర స్థాయిలు కలిగి ఉన్నందున, శుద్ధి చేసిన ఇతర నూనెలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది.

కొబ్బరి నూనెను అనేక సౌందర్య ఉత్పత్తులలో వాడుతారు. వర్జిన్ కొబ్బరి నూనెలో మంచి సువాసన ఉంటుంది. మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖం, శరీరానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. ఇది సహజంగా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనె శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉండటం వల్ల, ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె దీర్ఘకాలిక క్యాన్సర్‌ వ్యాధిని నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీ కార్సినోజెనిక్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కొబ్బరి నూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలు శరీరంలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందనీయకుండా వాటిని నిరోధిస్తాయి. కొబ్బరి నూనె మనిషిలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ కణాలు ఫ్రీ రాడికల్స్, ఇతర హానికరమైన ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి బాగా పనిచేస్తాయి. అంతేకాక, దీనిలో లారిక్ ఆమ్లం మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి బాగా పనిచేస్తుంది.

నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించండి కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు బాడీలోని ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి. కొబ్బరి నూనెలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. తద్వారా దంతాలు మరింత బలంగా తయారవుతాయి. కొబ్బరి నూనె మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల  బారిన పడే మహిళలకు ఇది ఊరట కలిగిస్తుంది.కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల వైరస్లు, హానికరమైన బ్యాక్టీరియాలను అంతం చేయవచ్చు. ఇది మూత్రాశయ వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

 

About rajak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *