మహమ్మారి కారణంగా చాలా మంది అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఉన్న లక్షణాలు కాకుండా ఈ ఓమిక్రాన్ కొత్తగా మరొక చర్మం లక్షణం చూపిస్తా ఉంది.కొరోనావైరస్ సోకిన వ్యక్తులలో చిల్‌బ్లెయిన్ అని కూడా పిలువబడే లక్షణాలు కాళి వేళ్లపై కనిపిస్తాయి. ఇది వేళ్లపై ఎరుపు, ఊదారంగు గడ్డలకు దారితీస్తుంది, ఇది నొప్పి, దురదను ప్రేరేపిస్తుంది. ఒమిక్రాన్ సోకిన వారి చర్మంపై అసాధారణ స్థాయిలో దద్దుర్లు, దురదలు వస్తుంటాయని కనుగొంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అది ఒమిక్రాన్ లక్షణం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
ఒమిక్రాన్ సోకిందా లేదా తెలియాలంటే చర్మంలో మార్పులను గమనించాలని లండన్ కింగ్స్ కాలేజీ పరిశోధకులు సూచిస్తున్నారు. జెడ్‌ఓఈ కొవిడ్ స్టడీ యాప్ ద్వారా 3.36 లక్షల మంది బాధితుల డేటాపై పరిశోధక బృందం ధ్యయనం చేసింది. కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు వస్తున్నట్టు గుర్తించారు.
దక్షిణాఫ్రికాలో మొదట కనుగొన్న కొత్త కరోనా వైరస్ ఓమిక్రాన్ వేరియంట్, ఇప్పుడు అనేక దేశాలలోకి ప్రవేశించింది. ఇది కేసుల సంఖ్య వేగంగా పెరగడానికి దారితీసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా హెచ్చరించింది. ఇది చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ముంచెత్తుతుందని పేర్కొంది. గత వారంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 11 శాతానికి పెరిగింది. అనేక దేశాలు ఆంక్షలు విధించేలా చేసింది. అటువంటి భయాందోళనలు, గందరగోళాల మధ్య, సురక్షితంగా అప్రమత్తంగా ఉండటం కూడా మన బాధ్యత.
అన్నింటికంటే ముఖ్యంగా, మీరు సాధారణ జలుబును పోలి ఉండే లక్షణాలను అనుభవిస్తున్నట్లయితే, వ్యక్తులతో సాంఘికం చేయవద్దు. ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ దేశమంతటా దావానలంలా వ్యాపిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు, ఒక్క భారతదేశంలోనే 600 పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ, నిపుణులు, ఆరోగ్య సంస్థలు కొత్త కోవిడ్ వేరియంట్‌ను తేలికపాటి ఇన్‌ఫెక్షన్‌లతో అనుబంధించాయి.
యుకే, యుఎస్ఏలలో చాలా తక్కువ మరణాల కేసులు నమోదయ్యాయి. కానీ డబ్ల్యుహెచ్ఓ ఈ వైవిధ్యాన్ని తీవ్రంగా పరిగణించాలని ప్రజలను కోరుతూనే ఉంది. దీనిని తేలికపాటి వ్యాధిగా కొట్టివేయవద్దు. వేరియంట్ వ్యాప్తి చెందుతున్న వేగం ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, శాస్త్రవేత్తలను అప్రమత్తం చేసింది.
అందుకే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే కోవిడ్19 నిబంధనలు కచ్చితంగా పాటించారు. ఇతరుల నుంచి భౌతిక దూరం, ఇంటి నుంచి బయటకు వెళితే మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అవసరమైన సమయంలో శానిటైజర్ వినియోగించడం చేస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. మాస్కులను ముక్కు, నోరు, దవడ భాగాలను సరిగ్గా కప్పి ఉంచేలా ధరించాల్సి ఉంటుంది.