నిద్రలేవగానే కాలు కింద పెట్టిన వెంటనే పాదాలలో నొప్పి ఉంటుంది. చాలా మందిలో, ఈ నొప్పి రోజు మొత్తము ఉండటమే కాకుండా నడవడానికి, ఇబ్బంది కలిగిస్తా ఉంటుంది. సాధారణంగా మన ఒంట్లో ఉండే నొప్పులు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతాయి. కానీ పాదాల్లోని ఈ నొప్పులు మాత్రం- ఉదయాన్నే లేచిన వెంటనే ప్రారంభమవుతాయి. ఈ నొప్పులు తరచూ వస్తూ ఉంటే డాక్టర్‌కు తప్పనిసరిగా చూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటే తాత్కాలిక ఉపశమనం కోసం వైద్య నిపుణులు ఈ కింది చిట్కాలను సూచిస్తున్నారు.
పాదాలు మీద ఎక్కువ ఒత్తిడి కలిగించే పనులు చెయ్యకూడదు.పాదాలను పైకి పెట్టి కూర్చోవటానికి ప్రయత్నించాలి. దీని వల్ల శరీరపు బరువు పాదాలపై పడదు. బరువు తగ్గడము వాళ్ళ పదాలుకి వున్న నొప్పి కొద్దిగా తగ్గుతుంది. కొన్ని ఇంటీలోనే ఉండి చేసుకొని ఉపశమనాలు తెలుసుకుందాము. రోజుకు రెండు సార్లు వెచ్చని నీటిలో పాదాలను ఒక పదినిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత ఐస్‌ను ఒక టవల్‌లో పెట్టి పాదాలను చుట్టి పెట్టాలి. ఇలా చేయటం వల్ల రక్త ప్రసరణం బాగా జరిగి పాదాల నొప్పి తగ్గుతుంది.
ఒక గిన్నెలో ఒక చిన్న పసుపు ముక్కను గ్రైండ్ చేసి, రెండు కప్పుల నీరు, 2 టేబుల్ స్పూన్లు వేసి, మిశ్రమాన్ని కొద్దిసేపు ఉంచండి. దానిలో ఒక పత్తి వస్త్రాన్ని ముంచి, కొంచెం నీరు పిండి, పాదాలకు అప్లై చేయండి, 10-15 నిమిషాలు ఇలా చేయండి, దీన్ని మూడుసార్లు చేయండి మరియు నొప్పిని తగ్గించండి.పాదాల నొప్పి ఉన్నవారు 3-4 గ్రాముల వెల్లుల్లిని ఆవ నూనెలో ఉడకబెట్టి, పాదాలతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాల నొప్పి తగ్గుతుంది. మీరు రాత్రి పడుకుంటే, నొప్పిని తగ్గించడానికి మరియు బాగా నిద్రపోవడానికి ఈ విధంగా మసాజ్ చేయండి.ఆవపిండిని అనేక సమస్యలకు ఉపయోగిస్తారు. అరకప్పు ఆవపిండిని ఒక బకెట్ నీటిలో వేసి, మీ పాదాలను నీటిలో నానబెట్టి, అరగంట విశ్రాంతి తీసుకోండి. ఇలా చేయడం వల్ల నొప్పి కూడా తగ్గుతుంది.
మహిళలు ఈ మధ్య కాలములో ఎక్కువ హైహీల్స్ వాడుతున్నారు ఫ్యాషన్ పేరుతో అది ఏ మాత్రము పాదాలకి మంచిది కాదు. వీలైనంత వరకూ హైహీల్స్‌ను వేసుకోవద్దు. ఇలా చెయ్యడము వల్ల పాదాలకి ఎక్కువ ఒత్తిడి కలిగి తీవ్రనొప్పి ఉంటుంది.ఇంటా బయట కూడా రబ్బరు చెప్పులు వేసుకోవాలి. ఈ మధ్యకాలంలో కాళ్ల నొప్పులు ఉన్నవారి కోసం కొన్ని ప్రత్యేకమైన చెప్పులు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగిస్తే చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
కాలి కండరాలను బలోపేతం చేసే కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలకు సంబంధించిన పూర్తి సమాచారం యూట్యూబ్ వీడియోలలో లభ్యమవుతాయి. వాటిని చూసి రోజూ కాసేపు ఆసనాలు ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల పాదాల సమస్యలు కొంత మేరకు తగ్గుముఖం పడుతుంది. వీటితో కూడా పాదాల నొప్పులు తగ్గకాపోతే డాక్టర్లను సంప్రదించాలి.