నోట్లో సిగరెట్ పెట్టుకుని.. గుప్పులు గుప్పులుగా పొగ వదలడాన్ని ట్రెండ్ అంటారు, స్టైల్ అంటారు. అంతేకాదు.. ఫ్యాషన్ అని కూడా చెబుతుంటారు. మరో ఆశ్చర్యకర విషయమేంటో తెలుసా ? స్మోకింగ్ అనారోగ్యమని తెలిసినా.. దీన్నో హ్యాబిట్ గా మార్చుకోవడం పరిపాటిగా మారింది. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని, కానీ పొగ తాగేవారు మాత్రం మానడం లేదు. నికోటియానా టొబాకమ్ మొక్క నుంచి ఆకులను సేక రించి కూర్చి ఎండబెడతారు. దాదాపు 7,000 రసాయనాల మిశ్రమం. నికోటిన్ అతి ముఖ్యమైన ముడిపదార్థం. దీనివల్లే పొగాకుకు బానిసలవుతారు. దీనిలో 45 కేన్సర్ కారకాలు ఉన్నాయి. దాదాపు 400 విషపదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఆరో గ్యానికి నష్టం చేకూర్చేవే.
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని అందరికి తెలుసు.. కానీ పొగ తాగేవారు మాత్రం మానడం లేదు. వారు అనారోగ్యంపాలు అవడమే కాకుండా పక్కవారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో సిగరెట్ తాగేవారు పెరిగిపోయారు. సిగరెట్ తాగడం అనేది నేటి రోజుల్లో ఒక ట్రెండ్‌గా మారిపోయింది. స్మోక్ చేసే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పొగాకు తయారీలో చేర్చే అనేక రకాల రసాయనాలు లంగ్ క్యాన్సర్ కు దారితీస్తాయి. ఈ కెమికల్స్ ఊపిరితిత్తుల్లోని కణాలను నాశనం చేస్తాయి. దాంతో కొత్త కణాల ఏర్పాటు పూర్తిగా క్రుశించి పోతుంది. దాంతో క్యాన్సర్ కు దారితీస్తుంది.పొగ తాగడం అలవాటు ఉన్న వారిపై కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని, వారు చనిపోయే ప్రమాదం కూడా అంతే ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. సిగరెట్ తాగే అలవాటు ఉన్న వారు సిగరెట్లను చేతితో పట్టుకుని నోట్లో పెట్టుకుంటారు కనుక అలా వైరస్ వారి నోట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.
సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది అని తెలిసినప్పటికీ ఎవరు జాగ్రత్త పడటం లేదు అని చెప్పాలి. అయితే సిగరెట్ తాగుతున్న వారు వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవడమే కాదు పక్కన ఉన్న వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని నిపుణులు చెబుతూనే ఉన్నారు. సిగరెట్ తాగుతున్న వారి పక్కన ఉన్న వారు ఆ పొగను పీల్చడం వల్ల వారు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.
సాధారణంగా ఎవరైనా సిగరెట్ తాగుతుంటే పక్కనున్న వారు ఎవరో సిగరెట్ తాగితే మనకు ఏమవుతుందిలే అంటూ అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే పక్కన ఎవరో సిగరెట్ తాగుతున్నప్పటికీ అతను బయటకు వదిలే పొగ పీలిస్తే పక్కవాళ్ల ఆరోగ్యానికి కూడ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుంది. చిన్నప్పుడు ఇతరులు వదిలిన సిగరెట్ పొగను పీల్చడం వల్ల ప్రభావానికి గురైన ఆడ పిల్లల్లో పెద్దయ్యాక కీళ్ల నొప్పులు తలనొప్పి ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది.