చలికాలం వచ్చింది అంటే చాలు పిల్లలు,పెద్దలు, వృద్దులు, అందరికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కాలం వస్తే అందరు స్వేటర్స్, బేడీషీట్స్ ఎక్కువ వాడుతారు. జలబు, తగ్గు, జ్వరం ఈ కాలములో సర్వసాధారణం. వీటితో పాటు పెదాలు, పాదాలు పగలడము, కండరాలు పట్టక పోవడం వంటివి జరుగుతాయి.
సూర్యరశ్మి ‘విటమిన్ డి’ని ప్రసాదించే సహజ మూలం. అందువల్ల ఉదయం సమయంలో సూర్యోదయం తర్వాత ఉదయం 8 గంటలలోపు సుమారు 25 నుంచి 30 నిమిషాలపాటు ఎండలో కూర్చోవడం చాలా విలువైనదని వారు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అలాగే సూర్యాస్తమయం సమయంలోనూ ఎండలో కూర్చుంటే శరీరానికి విటమిన్ డి లభిస్తుందని చెప్తున్నారు.
విటమిన్ డి అనేది రోగనిరోధక వ్యవస్థకు,ఉపయోగపడే హార్మోన్. మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మెలటోనిన్ నిద్ర హార్మోన్‌ను తయారు చేయడంలో మీకు సహాయపడుతుంది. సూర్యరశ్మి వల్ల శరీరానికి కలిగే అనేక ప్రయోజనాలను చూసిన తర్వాత మీరు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని గుర్తుంచుకోవాలి. అయితే సూర్యరశ్మిలో అతిగా ఉండవద్దు. ఎండలో అతిగా ఉండటం వల్ల చర్మం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
చలిగాలి ఎక్కవ బాడీకి తగలకుండా తగ్గినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటి అంటే మందపాటి దుస్తులు ధరించడము, చెవులో దూది పెట్టుకోవడము, ఎండలో ఉదయం ఉండడము చేయాలి. ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఈ కాలంలో శరీరంలో ఉండే హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతల కారణంగా అరుగుదల ఆలస్యంగా జరుగుతుంది.
మజ్జిగ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పదార్థాలను వీలైనంత వరకు తగ్గించి వాటి స్థానంలో వేడి వేడిగా రైస్, టమాటా, వెజిటబుల్ సూప్‌లను తీసుకోవాలి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచేందుకు తోడ్పడతాయి. ధరించే ఉన్ని దుస్తుల్ని, కప్పుకు రగ్గులు, రోజూ ఎండలో పెడుతుండాలి.సన్‌స్క్రీన్ లోషన్స్ ఎండాకాలంలో మాత్రమే కాదు, ఈ సమయంలోనూ అవసరమే. చలికాలంలో ఎండ చురుక్కుమంటుంది. లోషన్‌కు బదులు కొబ్బరి నూనె రాసుకుంటే మేలు.
రెండుపూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. పిల్లలకు సున్నిపిండి, గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. మహిళలు, వృద్ధులు స్నానం చేసే ముందు కొబ్బరినూనె పట్టించుకుని, గ్లిజరిన్ సబ్బుని వాడుకోవాలి. చలికి ప్రధానంగా మెడ నరాలు పట్టేయడం, బెణకడం, తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతాయి. అటువంటి వారు ఉదయం, సాయంత్రం పదీ పదిహేను నిమిషాల పాటు కాళ్లూ చేతులూ, మెడ కదుపుతూ వ్యాయామం చేయాలి.
చలికాలంలో దాహం వేయట్లేదని నీళ్లు తాగడం తగ్గించేస్తాం. శరీరానికి తగిన నీటిని అందించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అవసరమైనంత నీటిని తాగాలి. ఈ కాలంలో దొరికే అన్నిరకాల పళ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని తీసుకోవాలి. సోయా, చిక్కుళ్లు వంటి ప్రోటీన్లు గల గింజ ధాన్యాలు తీసుకోవాలి. అలర్జీ దరిచేకుండా ఉండాలంటే, ఈ కాలంలో దొరికే కమలాలు, ఉసిరి వంటి ‘సి’ విటమిన్ ఉన్న పండ్లను తీసుకోవాలి. దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా జాగ్రత్తల్ని తీసుకోవాలి.