కరోనావైరస్ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఆ పేరు పెట్టారు. కరోనా ‘క్రౌన్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చినది. ఇప్పటికే మొత్తం ఏడు కరోనావైరస్లు ఉన్నాయి, వీటిలో ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్. రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’. ఈ రెండురకాల కరోనావైరస్‌ల వల్ల సాధారణ జలుబు, జ్వరం వస్తుంది. ఈ సాధారణ కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకు, జంతువుల నుండి మనుషులకు వస్తుంది.
కరోనా వాక్సిన్ వల్ల రోగనిరొధక శక్తి పెరిగుతుంది.కాని ఈ వాక్సిన్ వల్ల కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ వల్ల కనిపించే కొన్ని అనారోగ్య లక్షణాలు ఒకటి లేదా రెండు రోజులు కనిపింవచ్చు. అయితే, వాటికి మీరు భయపడక్కర్లేదు. ఆ లక్షణాలు ఏమిటో చూసేయండి మరి. చలి, జ్వరం,అలసట,తలనొప్పి, వికారం.
ఇంజెక్షన్ ఇచ్చిన ప్రదేశంలో నొప్పి, వాపు, జ్వరం, తలనొప్పి మొదలైన వ్యాక్సిన్ దుష్ప్రభావాలు కొందర్లో కనిపించడం సహజం. అయితే కొందరిలో అరుదుగా రక్తం గడ్డ కట్టే సమస్య కూడా తలెత్తుతోంది. దీనితో పాటు ఇంకొందర్లో మయోకార్డైటిస్ (గుండె కండరం వాపు), పెరికార్డైటిస్ (గుండెను కప్పి ఉంచే పొర ఇన్‌ఫ్లమేషన్) సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్లతో యువతలో గుండెకు సంబంధించిన రెండు రకాల ఇన్‌ఫ్లమేషన్లు తలెత్తే అవకాశాలు ఉంటున్నాయని డబ్ల్యుహెచ్‌ఓ చెబుతోంది.
ప్రపంచంలో అత్యధికంగా టీకాల వేసిన దేశాల జాబితాలో ఇజ్రాయేల్ టాప్‌లో ఉంది. అయితే, ఫైజర్- బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఆ దేశం వినియోగిస్తుండగా.. టీకా తీసుకున్న పలువురికి గుండెల్లో మంట, కండరాల వాపు వంటి సమస్యలు తలెత్తాయి. ఈ కేసులపై ఆరోగ్య విభాగం అధికారులు పరిశోధన ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ కరోనా కమిషనర్ నచ్‌మన్ యాష్ వెల్లడించారు.. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే, ఈ రెండు వ్యాక్సిన్లతోనే గుండెకు సంబంధించిన దుష్ప్రభావాలు కనిపించే అవకాశాలు ఎక్కువ. ఈ రకమైన దుష్ప్రభావాలు రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్న కొద్ది రోజుల్లోనే మొదలవుతాయని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
అయితే ఇలాంటి సందర్భాలు అత్యంత అరుదనీ, ప్రాణాంతక కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌తో పోల్చుకుంటే, వ్యాక్సిన్ తదనంతర దుష్ప్రభావాలతో జరిగే ఆరోగ్య నష్టం తక్కువే కాబట్టి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. రెండో డోసు వేయించుకున్న వెంటనే గుండెకు సంబంధించిన స్వల్ప అస్వస్థత తలెత్తితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించడం అవసరం.